‘పైడితల్లి’కి ఉగాది శోభ | - | Sakshi
Sakshi News home page

‘పైడితల్లి’కి ఉగాది శోభ

Mar 31 2025 11:09 AM | Updated on Mar 31 2025 11:09 AM

‘పైడి

‘పైడితల్లి’కి ఉగాది శోభ

విజయనగరం టౌన్‌: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవా రి ఆలయం ఆదివారం ఉగాది శోభను సంతరించుకుంది. ఆలయ ఇంచార్జ్‌ ఈఓ కెఎన్‌విడివి.ప్రసాద్‌ నేత్రత్వంలో అమ్మవారికి పుష్పాలంకరణలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం అమ్మవారికి బూరెలతో నివేదన చేశారు. ఆలయమంతా పుష్పాలతోనూ, యాపిల్‌ పండ్లు, ద్రాక్ష పండ్లతో అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడు లు చెల్లించుకున్నారు. అనంతరం ఉగాది పర్వదినం పురస్కరించుకుని వేదపండితులను ఘనంగా సత్కరించి వారికి నగదు పురస్కారాలను అందజేశారు. స్థానిక రైల్వేస్టేషన్‌ వద్దనున్న వనంగుడి ఆవరణలో అమ్మవారికి నేతేటి ప్రశాంత్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో వేదపండితులు రాళ్లపల్లి రామసుబ్బారావు పంచాంగ శ్రవణం చేశా రు. కార్యక్రమంలో వేదపండితులు దూసి శివప్రసా ద్‌, తాతా రాజేష్‌, సాయికిరణ్‌, నరసింహమూర్తి, దూసి కృష్ణమూర్తిలు సహకారమందించారు.

‘పైడితల్లి’కి ఉగాది శోభ 1
1/1

‘పైడితల్లి’కి ఉగాది శోభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement