అధికారంలోకి వస్తే ఈపీఎఫ్ కనీస పెన్షన్‌ను రూ.9వేలు చెల్లిస్తామని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చి ఏళ్లు తరబడుతున్నా పెన్షన్ మాత్రం పెంచలేదని పలువురు పెన్షన్‌దారులు ఆరోపించారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీఎఫ్ కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు. పెన్షన్ పెంచండి మహాప్రభో అంటూ చేతులెత్తి దండం పెట్టారు. రైల్వేలో రాయితీలు, ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పి.శంకరరావు, కార్యదర్శి ఓ.ఎస్.ఎన్.మూర్తి, ఉపాధ్యక్షుడు వి.శేషగిరి, కమిటీ సభ్యులు ఆదినారాయణ, అప్పలరాజు, కె.రామారావు, కె. పాపారావు, తదితరులు పాల్గొన్నారు.
– విజయనగరం గంటస్తంభం