ఆకట్టుకున్న మోడల్‌ యూత్‌ పార్లమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న మోడల్‌ యూత్‌ పార్లమెంట్‌

Mar 19 2025 12:38 AM | Updated on Mar 19 2025 12:38 AM

ఆకట్టుకున్న మోడల్‌ యూత్‌ పార్లమెంట్‌

ఆకట్టుకున్న మోడల్‌ యూత్‌ పార్లమెంట్‌

విజయనగరం అర్బన్‌: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో విద్యార్థులు మంగళవారం నిర్వహించిన ‘యువ మంధన్‌ మోడల్‌ యూత్‌ పార్లమెంట్‌’ ప్రదర్శన ఆకట్టుకుంది. ‘వికసిత్‌ భారత్‌ : కెరియర్‌ డెవలప్‌మెంట్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, ఎంప్లాయ్‌మెంట్‌ అనే అంశంపై విద్యార్థులు, అధ్యాపకులు కలిసి ఈ ప్రదర్శన చేపట్టారు. విద్యార్థులే ఎంపీలు, స్పీకర్‌, కార్యదర్శి వంటి భూమికలను పోషించి చర్చలను ఉత్సాహంగా, ప్రతిభావంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ తంత్రవాహి శ్రీనివాసన్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి, విమర్శనాత్మక ఆలోచనను ప్రేరేపించడం, పరిపాలనా వ్యవస్థపై అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో ఈ ప్రదర్శన సదస్సు నిర్వహించామని తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్‌, అవార్డులను రిజిస్ట్రార్‌ అందజేశారు. కార్యక్రమంలో హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ డీన్‌ ప్రొఫెసర్‌ ఎం.శరత్‌ చంద్రబాబు, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ డీన్‌ ప్రొఫెసర్‌ జితేంద్రమోహన్‌ మిశ్రా, డాక్టర్‌ కుసుమ్‌, మాన్సాస్‌ కరస్పాండెంట్‌ ప్రొఫెసర్‌ కేవీలక్ష్మీపతి రాజు, డాక్టర్‌ ప్రేమాఛటర్జీ, డాక్టర్‌ నగేష్‌, డాక్టర్‌ ఎన్‌వీఎస్‌ సూర్యనారాయణ, డాక్టర్‌ దెబంజనా నాగ్‌, వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement