ఎస్పీ గ్రీవెన్స్‌ సెల్‌కు 32 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ గ్రీవెన్స్‌ సెల్‌కు 32 ఫిర్యాదులు

Mar 18 2025 10:00 PM | Updated on Mar 18 2025 10:01 PM

విజయనగరం క్రైమ్‌: జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం ఎస్పీ వకుల్‌ జిందల్‌ నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో 32 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ వకుల్‌ జిందల్‌ చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్కడికక్కడే బాధితుల ముందే సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్స్‌ను ఆదేశించారు. ఎస్పీ వకుల్‌ జిందల్‌ అందుకున్న ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించినవి 10, కుటుంబ కలహాలకు సంబంధించినవి 7, మోసాలకు పాల్పడినవి 8, ఇతర అంశాలకు సంబంధించినవి 7 ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐలు ఏవీ. లీలారావు, ఆర్వీఆర్‌ .చౌదరి, డీసీఆర్బీ ఎస్సై రాజేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

అలసత్వం లేకుండా ఫిర్యాదుల పరిష్కారం

పార్వతీపురం రూరల్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఫిర్యాదులను అలసత్వం లేకుండా పరిష్కారం దిశగా విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని, క్షుణ్ణంగా పరిశీలించారు. వచ్చిన ఫిర్యాదుల్లో సైబర్‌మోసాలు, కుటుంబ కలహాలు, తల్లిదండ్రులను వేధింపులు, అత్తారింటి వేధింపులు, భూ ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్‌ మోసం, ప్రేమ పేరుతో మోసం తదితర సమస్యలపై ఫిర్యాదుదారులు ఎస్పీకి విన్నవించుకోగా వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ ఫోన్‌లో మాట్లాడి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి దర్యాప్తుచేసి వాస్తవాలైనట్‌లైతే చట్టపరిఽధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

పీజీఆర్‌ఎస్‌కు 54 వినతులు

సీతంపేట: ఐటీడీఏలో పీఓ సి.యశ్వంత్‌కుమార్‌ రెడ్డి సోమవారం ర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 54 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో భామిని మండలం బొడ్డగూడకు చెందిన బి.సింగన్న కిరాణా షాపు పెట్టుకోవడానికి రుణం ఇప్పించాలని కోరాడు. చేపల చెరువు మంజూరు చేయాలని నిమ్మలవలసకు చెందిన అప్పారావు కోరగా మండ గ్రామానికి చెందిన నిమ్మక పార్వతి, ఎన్‌టీఆర్‌ జలసిరిలో బోరు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. నౌగూడకు చెందిన ఆనందరావు ట్రాక్ట్‌ర్‌ సబ్సిడీపై ఇప్పించాలని వినతిపత్రం అందజేశాడు. మేకలలోన్‌ మంజూరు చేయాలని అప్పారావు కోరగా రోడ్డు సదుపాయం కల్పించాలని జజ్జువ గ్రామస్తులు అర్జీ అందజేశారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, ఈఈ రమాదేవి, డీడీ అన్నదొర, డిప్యూటీఈవో ప్రసన్నకుమార్‌, సీడీపీఓలు రంగలక్ష్మి, విమలాకుమారి తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ గ్రీవెన్స్‌ సెల్‌కు 32 ఫిర్యాదులు1
1/2

ఎస్పీ గ్రీవెన్స్‌ సెల్‌కు 32 ఫిర్యాదులు

ఎస్పీ గ్రీవెన్స్‌ సెల్‌కు 32 ఫిర్యాదులు2
2/2

ఎస్పీ గ్రీవెన్స్‌ సెల్‌కు 32 ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement