సందడి చేసిన కోర్ట్‌ చిత్రం యూనిట్‌ | - | Sakshi
Sakshi News home page

సందడి చేసిన కోర్ట్‌ చిత్రం యూనిట్‌

Mar 18 2025 10:00 PM | Updated on Mar 18 2025 10:01 PM

విజయనగరం టౌన్‌: నగరంలోని ఏసీవీసీ రంజని, శివరంజని సినిమా హాల్‌లో కోర్టు చిత్రం యూనిట్‌ సందడి చేసింది. చిత్రం యూనిట్‌కు థియేటర్‌ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిత్రంలో మంగపతిగా నటించిన సీనియర్‌ నటుడు శివాజీ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించడం ఆనందంగా ఉందన్నారు. లాయర్‌గా నటించిన నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ పోక్సో చట్టం లోని లోటుపాట్లను ఆలోచనాత్మకంగా ఈ సినిమాలో చూపించామని చెప్పారు. పోక్సో చట్టం గురించి తెలియని కోణాలను ఈ సినిమాలో చూపించినట్లు తెలిపారు. హీరో, హీరోయిన్‌ రోషన్‌, శ్రీదేవిలు మాట్లాడుతూ తమ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు రామ్‌ జగదీష్‌ మాట్లాడుతూ ఈ సినిమాలో చట్ట వ్యవస్థపై అవగాహన పెంచుతూ, నేటియువతకు సందేశాత్మక చిత్రంగా రూపొందించామన్నారు. కార్యక్రమంలో ఽథియేటర్‌ మేనేజర్‌ సాయి, ఇన్‌చార్జి రాజశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement