
రైతులు దూరం..!
ఈకేవైసీకి 4,918 మంది
విజయనగరం ఫోర్ట్: పంటల సాగులో ఈ–క్రాప్ నమోదు చాలా ముఖ్యమైనది. పంటను విక్రయించుకోవాలన్నా, పంట నష్టం జరిగినప్పడు బీమా పొందాలన్నా ఈ క్రాప్ నమోదు తప్పనిసరి. ఈ– క్రాప్ నమోదు చేసుకున్న ప్రతీ రైతు ఈకేవైసీ చేయించుకోవాలి. ఈ–క్రాప్, ఈకేవైసీ చేయించుకుంటేనే రైతులకు రావాల్సిన పథకాలు, సౌకర్యా లు అందుతాయి. లేదంటే అందవు. రబీ సీజనల్‌లో వేలాది మంది రైతులు ఈకేవైసీ చేయించుకోలేదు. ఈ – క్రాప్ నమోదు చేయించుకున్నప్పటకీ ఈకేవైసీ మాత్రం చేసుకోలేదు.
రబీలో ఇలా..
జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి 61,324 మంది ఈ–క్రాప్ నమోదు చేసుకున్నారు. 56,406 మంది రైతులు ఈౖకేవేసీ చేయించుకున్నారు. 4,918 మంది ఈకేవైసీ చేయించుకోలేదు. 1,02,760 ఎకరాల్లో అన్ని రకాల పంటలకు ఈ–క్రాప్ నమోదు అయింది. 96,097 ఎకరాలకు ఈకేవైసీ జరిగింది. 6,673 ఎకరాలకు ఈకేవైసీ జరగ లేదు.
బీమా పంటలకు సంబంధించి ఈ–క్రాప్ ఇలా..
వరి, మినుము, పెసర, మొక్కజొన్న పంటలకు పంటల బీమా వర్తిస్తుంది. ఈ నాలుగు పంటలకు సంబంధించి 97,778 ఎకరాలకు ఈ–క్రాప్ నమోదు అయింది. ఇందులో ఈకేవైసీ 91,315 ఎకరాలకు అయింది. 6,463 ఎకరాలకు ఈకేవైసీ జరగలేదు. వరి పంటకు సంబంధించి 2279 ఎకరాలకు ఈ– క్రాప్ అయింది. ఈకేవైసీ 2052 ఎకరాలకు అయింది. 1594 మంది ఈ–క్రాప్ చేసుకోగా1452 మంది రైతులు ఈకేవైసీ చేయించుకున్నారు. మినుము పంటకు సంబంధించి 39,538 ఎకరాలకు ఈ–క్రాప్ నమోదు కాగా ఈకేవైసీ 37,073 ఎకరాలకు అయింది. 33,480 మంది రైతులు ఈ–క్రాప్ నమోదు చేసుకోగా ఈకేవైసీ 31082 మంది రైతులు చేసుకున్నారు. పెసర పంటలకు సంబంధించి 15,769 ఎకరాలకు ఈ–క్రాప్ నమోదు కాగా ఈకేవైసీ 14,813 ఎకరాలకు ఈకేవైసీ అయింది. 17,593 మంది రైతులకు ఈ–క్రాప్ నమోదు కాగా ఈకేవైసీ 16,319 మంది రైతులు చేసుకున్నారు. మొక్కజొన్న పంటకు సంబంధించి 40,191 ఎకరాలకు ఈ–క్రాప్ నమో దు కాగా ఈకేవైసీ 37,377 ఎకరాలకు ఈకేవైసీ అయింది. 23,398 మంది రైతులు ఈ–క్రాప్ నమో దు కాగా ఈకేవైసీ మాత్రం 21,527 మంది రైతులు చేసుకున్నారు.
ఈ – క్రాప్ చేయించుకున్న రైతులు 61,324 మంది
ఈకేవైసీ చేయించుకున్న రైతులు 54,406 మంది
1,02,760 ఎకరాలకు ఈ – క్రాప్
96,087 ఎకరాలకు ఈకేవైసీ
6,673 ఎకరాలకు జరగని ఈకేవైసీ
ఈకేవైసీతో ప్రయోజనాలు
పంటల బీమా వర్తిస్తుంది.
పంట రుణాలు తీసుకోవచ్చు.
ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం అందుకోవచ్చు.
పండించిన ధాన్యాన్ని అమ్ముకోవచ్చు.
94 శాతం పూర్తి
రబీ సీజన్‌లో అన్ని పంటలకు సంబంధించి ఈకేవైసీ 94 శాతం పూర్తయింది. 4,918 మంది రైతులు ఈకేవైసీ చేయించుకోలేదు. ఈ–క్రాప్, ఈకేవైసీపై ఈ నెల 17వతేదిన సోషల్ ఆడిట్ ప్రారంభం అవుతుంది. అంతవరకు ఈకేవైసీ చేయించుకోవచ్చు.
– వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి