
వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో పశువులపాక, గడ్డివాములు దగ్ధం
వేపాడ: మండలంలోని రామస్వామిపేట, బొద్దాం గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో పశువులపాక, గడ్డివాములు, నీలగిరి తోట అగ్నికి ఆహూతయ్యాయి. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామస్వామిపేటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ప్రమాదంలో పాత్రునాయుడు, ఎ.విజయలక్ష్మి, టి.నాగేష్, జి.తాత, గొలగాని కృష్ణమూర్తికి సంబంధించిన ఐదు గడ్డివాములు పక్కనే ఉన్న నీలగిరి తోట దగ్ధమయ్యాయి. సుమారు రూ.20 వేల నష్టం వాటిల్లింది. అలాగే బొద్దాం రామాలయం సమీపంలో మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో గ్రామానికి చెందిన నీలంశెట్టి దేముడమ్మ పశువుల పాక దగ్ధమైంది. కళ్లంలో ఉన్న టేకుదుంగలు, సపోటా చెట్లు కాలిపోయాయి. ప్రమాదం సమయంలో పశువులు మేతకు వెళ్లడం వల్ల వాటికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సుమారు రూ.30వేల ఆస్తినష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదాలపై వీఆర్‌ఓలకు సమాచారం అందించినట్లు బాధితులు తెలిపారు.

వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో పశువులపాక, గడ్డివాములు దగ్ధం