తాటిపూడిలో 200 ఎకరాల్లో భూమాత వెంచర్‌ | - | Sakshi
Sakshi News home page

తాటిపూడిలో 200 ఎకరాల్లో భూమాత వెంచర్‌

Mar 17 2025 12:20 AM | Updated on Mar 17 2025 12:20 AM

తాటిపూడిలో 200 ఎకరాల్లో భూమాత వెంచర్‌

తాటిపూడిలో 200 ఎకరాల్లో భూమాత వెంచర్‌

● ఉడా అనుమతులతో 5ఫేజ్‌లలో 1650 ప్లాట్స్‌ ● ఎక్కడా లేనివిధంగా క్లబ్‌హౌస్‌, స్విమ్మింగ్‌పూల్‌తో వెంచర్‌ ఏర్పాటు ● ‘భూమాతాస్‌ ఎస్‌ఎన్‌ స్వప్నలోక్‌’ బ్రోచర్‌ రిలీజ్‌

శృంగవరపు కోట: రియల్‌ ఎస్టేట్‌ చరిత్రలో ఎవరూ ఇవ్వని సౌకర్యాలు క్లబ్‌హౌస్‌, స్విమ్మింగ్‌పూల్‌ సదుపాయాలతో ‘భూమాతాస్‌ ఎస్‌ఎన్‌ స్వప్నలోక్‌’ నూతన వెంచర్‌ను వేసినట్లు భూమాత మేనేజింగ్‌ డైరెక్టర్‌ తాళ్లూరి పూర్ణచంద్రరావు, ఎస్‌ఎన్‌ గ్రూప్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ అన్నారు. భూమాత గ్రూప్‌, ఎస్‌బీఎన్‌ గ్రూప్‌ సంయుక్తంగా ఆదివారం విశాఖపట్నంలోని సాయిప్రియ రిసార్ట్స్‌లో ‘భూమాతాస్‌ ఎస్‌ఎన్‌ స్వప్నలోక్‌‘ బ్రోచరిను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వెంచర్‌ విజయనగరం జిల్లాలోని తాటిపూడి వద్ద సుమారు 200 ఎకరాలలో 5 ఫేజ్‌లలో 1650 ప్లాట్స్‌ ఉడా అనుమతులతో అందరికీ అందుబాటు ధరలతో విడుదల చేశామని తెలిపారు. ఈ వెంచర్‌ పూర్తిగా ఒక థీమ్డ్‌ ప్రీమియం రెసిడెన్షియల్‌ మెగా ప్రాజెక్ట్‌ను కస్టమర్స్‌కు విశ్రాంతి, వినోదం ఇచ్చే ఇలాంటి భారీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌లో మొదటిదని చెప్పారు. ఈ వెంచర్‌కు ఇప్పటికే విశేష స్పందన వచ్చిందన్నారు. ఈ వెంచర్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలోని 7 వండర్స్‌ తాలూకా కళాకృతులు కస్టమర్స్‌ సందర్శన కోసం రిసార్ట్‌ సౌకర్యాలతో పాటు పెట్టడం వల్ల విశేష ఆదరణ ఈ స్వప్నలోక్‌ ప్రాజెక్టుకు వస్తుందన్నారు. ఈ స్వప్నలోక్‌ వెంచర్‌ సమీపంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే తాటిపూడి రిజర్వాయర్‌ను టూరిజం స్పాట్‌గా చేసి అక్కడ బోట్‌ షికారు పెట్టిందన్నారు.

టూరిజం అభివృద్ధి

త్వరలో 200 ఎకరాల్లో హెలికాప్టర్‌ ద్వారా హెలిటూరిజం ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ వెంచర్‌ సమీపంలో 500 ఎకరాల్లో జిందాల్‌ కంపెనీ వారు టూరిస్ట్‌ స్పాట్‌గా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. స్వప్నలోక్‌ వెంచర్‌ సమీపంలో భవిష్యత్‌లో టూరిజంగా అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయన్నారు. ఈ వెంచర్‌ మీదుగా 4 లైన్ల హైవే పనులు త్వరలో ప్రారంభంకానున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 1500 మంది మార్కెటింగ్‌ సభ్యులు, డైరెక్టర్‌ తాల్లూరి శివాజీ, కిరణ్‌ శంకర్‌, గోపాల్‌ హాజరయ్యారు. విజయనగరంలో మార్కెటింగ్‌ సభ్యుల కోసం ప్రత్యేకంగా మార్చి 23న సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ నెలలో మెగా కస్టమర్‌ మేళా తాటిపూడి వద్ద స్వప్నలోక్‌ వెంచర్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు తాళ్లూరి పూర్ణచంద్రరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement