
పదోతరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
స్ట్రాంగ్ రూంలో సహాయ కేంద్రం
విద్యాశాఖకు చెందిన స్ట్రాంగ్ రూంలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సందేహాలను సెల్ 90009 45346 నంబర్‌కు ఫోన్‌చేసి నివృత్తి చేసుకోవచ్చు. జిల్లా పరిశీలకులుగా ఆదర్శ పాఠశాల జేడీ సుల్తానా బేగంను నియమించారు.
విజయనగరం అర్బన్:
పదోతరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు శనివారం తెలిపారు. పరీక్షకు హాజరుకానున్న 23,765 మంది రెగ్యులర్ విద్యార్థులకు 119, ఓపెన్ స్కూల్ విద్యార్థులు 614 మందికి 8 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు రెగ్యులర్ విద్యార్థులకు, ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. పరీక్షల పర్యవేక్షకులు/డిపార్ట్‌మెంట్ అధికారులుగా 238 మంది, ఇన్విజిలేటర్లుగా 1,150 మంది, కస్టోడియన్లుగా 36 మంది, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ 9 మంది విధుల్లో పాల్గొంటారని, 9 రూట్లలో స్టోరేజ్ సాయింట్లు 29 ఏర్పాటు చేశామన్నారు.
సీసీ కెమెరాల నిఘాలో..
మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం ఉన్న జిల్లాలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను అనుసంధానం చేసినట్టు డీఈఓ తెలిపారు. పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. సమీపంలోని జెరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలిచ్చామన్నారు. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, ముఖ్య పర్యవేక్షకులు, డిపార్ట్‌మెంట్ అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. వీరుకూడా సెల్‌ఫోన్‌లు, డిజిటల్ వాచీలు తీసుకెళ్లకూడదన్నారు. తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుందని, పరీక్షకు సమయానికి ముందుగానే 24 పేజీల బుక్‌లెట్ విద్యార్థికి అందజేస్తామన్నారు. బుక్‌లెట్ నంబర్ వేసి, విద్యార్థితో పాటు ఇన్విజిలేటర్ ధ్రువీకరించాలన్నారు. ఏమైనా తప్పులుంటే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. అదనంగా కావాలంటే మరో 12 పేజీల వరకు ఉన్న బుక్‌లెట్ ఇస్తారు.
మాట్లాడుతున్న
డీఈఓ
యు.
మాణిక్యం
నాయుడు
రేపటి నుంచి పరీక్షలు
119 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 23,765 మంది విద్యార్థులు
నాలుగు సమస్యాత్మక కేంద్రాల్లో
సీసీ కెమెరాల ఏర్పాటు