ఉపాధిహామీ పనుల్లో టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు.. ఎలాంటి సమాచారం లేకుండా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మేట్‌ను తొలగించారు.. 49 మంది వేతనదారులకు పని కల్పించడం లేదు.. ఇదెక్కడి అన్యాయమంటూ విజయనగరం మండలం కొండకరకాం గ్రామంలోని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వేతనదారులు గురువారం విజయనగరం ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. మేట్‌గా నరవ సత్యవతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఎంపీడీఓకు వివరించి వినతిపత్రం అందజేశారు. పని కల్పించకుండా ఇబ్బంది పెడుతున్న ఫీల్డు అసిస్టెంట్ చింతపల్లి అప్పలస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ మామిడి అప్పలనాయుడు వేతనదారులతో మాట్లాడారు. న్యాయం చేస్తానని చెప్పారు. – విజయనగరం