● భిక్షాటన చేస్తూ జీవనయానం
● తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులే కారణం
● పట్టించుకోని సంబంధిత అధికారులు
రామభద్రపురం: ఏ దేవుడు ఈ చిన్నారుల మొర ఆలకిస్తాడు? ఏ అధికారి వీరి దీనస్థితిని పట్టించుకుంటాడు? ఏ నాయకుడు ఈ పిల్లలకు అండగా ఉంటాడు? ఇంటి ఆర్థిక పరిస్థితులు సహకరించక..
ఆటపాటలతో మమేకమవుతూ విద్యను అభ్యసించవలసిన వయసులో ఎందరో బడిఈడు పిల్లలు బడి బయట భిక్షాటన చేస్తున్నారు. అలాగే వీధి పిల్లలుగా, బాలకార్మికులుగా మారుతుండడం దురదృష్టకరం. బడిఈడు పిల్లలు బడికి వెళ్లకుండా వీధులలో, ఆలయాల వద్ద భిక్షాటన చేస్తూ కనబడడంతో ప్రభుత్వ పరిరక్షణ ఇంత దీనస్థితితో ఉందా అంటూ పలువురు విమర్శిస్తున్నారు.బాలల పరిరక్షణ గురించి ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులు కనీసం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలలో ఆర్థిక, సామాజిక పరిస్థితుల కారణంగా కొంతమంది తల్లిదండ్రులే తమ పిల్లల్ని బలవంతంగా బడిమాన్పించి, భిక్షాటన చేయించడం, ఇంటి పనికో, దుకాణాలకో, మెకానిక్ షెడ్డులకో లేదంటే వ్యవసాయపనులకో పంపిస్తూ బాలకార్మికులుగా మారుస్తున్నారు. ఈ పద్ధతిని మార్చి పిల్లలంతా బడికి వెళ్లేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, బాలల పరిరక్షణ కమిటీ తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోకుండా విద్యాహక్కు చట్టానికి విఘాతం కలిగిస్తున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ ఉంటే పలువురు చిన్నారులు బహిరంగంగా భిక్షాటన ఎందుకు చేస్తారని, బాలల పరిరక్షణ కమిటీ పర్యవేక్షణ కరువైందని పలువురు విమర్శిస్తున్నారు
బడిబయట బడిఈడు పిల్లలు
బడిబయట బడిఈడు పిల్లలు
బడిబయట బడిఈడు పిల్లలు
బడిబయట బడిఈడు పిల్లలు