
ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం
విజయనగరం:
వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా నేతలంతా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేకరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను మజ్జి శ్రీనివాసరావు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా స్థాపించిన వైఎస్సార్‌సీపీ 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని విజయపథంలో నడిపించడంలో సఫలీకృతులయ్యా రని గుర్తుచేశారు. భవిష్యత్‌లో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు.
పార్టీ జెండాను ఎగురవేసిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం