
పారా అథ్లెటిక్స్‌లో రాణించిన లలిత
విజయనగరం: న్యూ ఢిల్లీ వేదికగా ప్రారంభమైన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025 పోటీల్లో 1500 మీటర్ల పరుగు పందెంలో ఉమ్మడి విజయనగరం జిల్లా క్రీడాకారిణి కిల్లక లలిత కాంస్య పతకం గెలుచుకుంది. ఆమె గెలుపు జిల్లాకు గర్వకారణమని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో 20 దేశాలకు చెందిన పారా క్రీడాకారులు పాల్గొన్నారని, గట్టి పోటీలో సైతం అసామాన్య ప్రతిభ కనబరచిన లలిత తానేంటో నిరూపించడమే కాకుండా అంతర్జాతీయస్థాయిలో విజయనగరం పేరు మారుమోగేలా చేసిందని ప్రశంసించారు. ఈ పతకం మన రాష్ట్ర క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహన్ని నింపిందని, ఇతర విభాగాల్లోనూ ఆమె పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించిన లలితకు కలెక్టర్ డాక్టర్. బీఆర్.అంబేడ్కర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావులు అభినందనలు తెలియజేశారని చెప్పారు.
కాంస్య పతకం కై వసం