
వేపాడ: మండలంలోని జాకేరు గ్రామంలో రామాలయం పదో వార్షికోత్సవాన్ని మంగళ, బుధవారాల్లో నిర్వహిస్తున్నట్లు గ్రామసర్పంచ్ బుద్దా చిన్నమ్మలు అప్పలనాయుడు దంపతులు తెలిపారు. గ్రామపెద్దలు, గ్రామస్తుల సహకారంతో నిర్వహిస్తున్న వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం భైటో భజన, బుధవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు. సీతారాముల కల్యాణోత్సవం, అన్నసమారాధన, మహిళల కోలాటం సాయంత్రం ఎడ్లబళ్ల పరుగు ప్రదర్శన నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎడ్లు పరుగు ప్రదర్శనలో విజేతలకు నగదు బహుమతులు అందచేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నామన్నారు.