
వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రైతు గ్రూపులకు రాయితీపై అందజేసిన ట్రాక్టర్లు
శనివారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2023
రెంటికీ చెడ్డ రేవడిలా..!
శతాబ్దం క్రితం జరిగిన పొరపాటు ఆగ్రామ రైతుల పాలిట శాపంగా మారడంతో నేటికీ అవస్థలు పడుతున్నారు.
–8లో
సాగు సులభం..
రైతుకు ఆదాయం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వ్యవసాయం దండగ అన్న టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరిగా గాకుండా వ్యవసాయాన్ని పండగ చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టింది మొదలు నాలుగేళ్లుగా రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయడంలో భాగంగా సాగులో యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. సాగుఖర్చు తగ్గించడంతో పాటు కూలీల కొరత సమస్యను అధిగమించేందుకు అవసరమైన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలను రాయితీపై అందిస్తున్నారు. దీనివల్ల దుక్కిదున్నే పని మొదలు దమ్ము, నాట్లు, కోత, నూర్పిడి వరకూ అన్ని పనులూ యంత్రాలతో సులుభంగా, తక్కువ ఖర్చుతో చేయడానికి వీలు కలుగుతోంది. కూలీల సమస్య తీరడమే గాక సమయానుకూలంగా సాగు పనులను రైతులు పూర్తిచేసి అధిక దిగుబడులు సాధిస్తున్నారు.
ఆర్‌బీకే కేంద్రంగా...
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రా (ఆర్‌బీకే)లకు అనుబంధంగా కస్టమ్ హైరింగ్ సెంటర్ల (సీహెచ్‌సీ)ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద రైతు గ్రూపులకు సాగు పరికరాలను సమకూర్చుతోంది. సీహెచ్‌సీలో సభ్యులైన రైతులు 10 శాతం వాటాగా చెల్లిస్తే సరిపోతోంది. ప్రభుత్వం 40 శాతం రాయితీ ఇస్తోంది. మిగతా 50 శాతం మొత్తాన్ని బ్యాంకు రుణం కింద సమకూర్చుతోంది.
పండగలా యంత్రసేవా పథకం...
వైఎస్సార్ యంత్ర సేవా పఽథకం రైతులకు ఒక పండగ వాతావరణాన్ని తీసుకొస్తోంది. విజయనగరం జిల్లాలో మొదటి, రెండు విడతల్లో 335 ట్రాక్టర్లను ప్రభుత్వం ిసీహెచ్‌సీలకు అందించింది. మొదటి విడతలో 212 ట్రాక్టర్లు, రెండో విడతలో 123 ట్రాక్టర్లు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. మొదటి విడతలో 326 గ్రూపులకు, రెండో విడత 184 గ్రూపులకు యంత్ర పరికరాలను జిల్లా అధికారులు అందజేశారు. మొదటి విడతలో అందించిన యంత్ర పరికరాల విలువ రూ.28.45 కోట్లు. ప్రభుత్వం రూ.9.34 కోట్ల రాయితీని అందించింది. అలాగే, రెండో విడతలో అందించిన పరికరాల విలువ రూ.15.10 కోట్లు. అందులో రూ.4.54 కోట్ల మేర ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ విడతలో 78 ట్రాక్టర్లు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా రోటావేటర్లు, వరి నూర్పిడి యంత్రాలు, మొక్కజొన్న నూర్పిడి యంత్రాలు, స్ప్రేయర్లు, పవర్ వీడర్లు, వరి కోత యంత్రాలు, ట్రాక్టర్ ఆధారిత ఇతర వ్యవసాయ యంత్ర పరికరాలు ఇవ్వడం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి.
టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ్ముళ్లకే...
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతు రథం పేరిట ట్రాక్టర్లు రైతులకు ఇస్తామని నాయకులు ప్రకటించినా తీరా అమల్లోకి వచ్చేసరికి అవన్నీ ఆ పార్టీ కార్యకర్తలకే అందాయి. రాజకీయాలకు అతీతంగా సామాన్య రైతులకు ఒక్క ట్రాక్టర్ కూడా ఇవ్వకపోవడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ట్రాక్టర్లను కూడా కొంతమంది టీడీపీ నాయకులు తీసుకున్నట్లే తీసుకొని వేరొకరికి అమ్మ కం పెట్టేశారు. ప్రభుత్వ రాయితీని కొల్లగొట్టేశారు. మళ్లీ అలాంటి అక్రమాలు పునరావృతం గాకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వ్యక్తిగతంగా గాకుండా రైతులను గ్రూపులుగా చేసి ఆర్‌బీకేలకు అనుబంధంగా ట్రాక్టర్లను సమకూర్చుతోంది. అసలైన రైతులకు ప్రయోజనం కల్పిస్తోంది.
న్యూస్‌రీల్
వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రభుత్వ ప్రోత్సాహం
రైతులకు రాయితీపై ట్రాక్టర్లు,
యంత్ర పరికరాలు
కూలీలు, సాగు ఖర్చు తగ్గించడమే లక్ష్యం
తొలిరెండు విడతల్లో 335
ట్రాక్టర్ల అందజేత
ట్రాక్టర్ల విలువ రూ.43.65 కోట్లు
ప్రభుత్వ రాయితీ రూ.13.88 కోట్లు
ఇచ్చిన మాట ప్రకారం ట్రాక్టర్
సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మాకు ట్రాక్టరు అందించారు. అదే గత టీడీపీ ప్రభుత్వ పాలనలో మేము ఎంత బతిమాలుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు ఎవ్వరినీ అడగాల్సిన పనిలేదు. గ్రామ వ్యవసాయ సహాయకులే మా దగ్గరకు వచ్చి రైతులంతా గ్రూపుగా ఏర్పడమని చెప్పారు. మా గ్రూపుకు ట్రాక్టరు వచ్చేలా దరఖాస్తు చేయించారు.
– ఉమామహేశ్వరరావు,
రైతు, ఆలుబిల్లి గ్రామం, వంగర మండలం
సంతోషంగా ఉంది
మాలాంటి సామాన్య రైతులకు ఇప్పటివరకూ ట్రాక్టరుతో పనిచేయించాలంటే వ్యయప్రయాసలు తప్పేవికావు. ఇప్పుడు జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం ట్రాక్టర్ ఇచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాగ్రూపు సభ్యులతో పాటు గ్రామ రైతు భరోసా కేంద్రం పరిధిలో ఉన్న రైతులకు ట్రాక్టర్‌ను వినియోగిస్తాం.
– పొగిరి శ్రీరాములు, రైతు, రేగిడి
జగన్‌మోహన్ రెడ్డి రైతు పక్షపాతి
ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి రైతు పక్షపాతి. ఏదిఏమైనా ఎంత భారమైనా వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఏటా రైతులకు రూ.13,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. మాలాంటి రైతులకు విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు డబ్బులు ఉపయోగపడుతున్నాయి. కూలీల కొరత ఉన్న పరిస్థితుల్లో ట్రాక్టర్ ఇవ్వడం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
– వంగపండు శ్రీరామమూర్తి, రైతు, తెర్లాం



ట్రాక్టర్లను ప్రారంభిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ

డీఎంహెచ్‌ఓ భాస్కరరావుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలుపుతున్న వైద్య సిబ్బంది

రేగిడి ఎమ్మార్సీ కార్యాలయంలో నాడు–నేడు పనులపై సమీక్షిస్తున్న డీఈఓ లింగేశ్వరరెడ్డి



