మెరకముడిదాం: మండలంలోని శ్యామాయవలస గ్రామంలో సోమవారం రాత్రి ఒకబైక్, రెండు సెల్‌ఫోన్లు అసహరణకు గురయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గరివిడి మండలం చుక్కవలస గ్రామానికి చెందిన మీసాల శివాజీ తన అత్తవారిల్లు దాసరిబుజ్జి ఇంటికి సోమవారం సాయంత్రం వచ్చాడు. రాత్రి అత్తవారింటిముందు తన బైక్ పెట్టి పడుకున్నాడు. అయితే అర్ధరాత్రి రెండుగంటల సమయంలో ఇంటిముందు ఉన్న బైక్, ఇంట్లో ఉన్న రెండు మొబైల్‌ఫోన్లు గుర్తుతెలియని దుండగులు అపహరించుకుపోయారు. మంగళవారం ఉదయం ఇంటిముందు బైక్‌లేకపోవడంతో అశ్చర్యానికి గురైన శివాజీ..తన మొబైల్ కూడా అపహరణకు గురైనట్లు తెలుసుకుని వెంటనే బుదరాయవలస పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హెడ్‌కానిస్టేబుల్ అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.