ఇంటర్‌ నాన్‌ టీచింగ్‌ సంఘం అధ్యక్షుడిగా బాబ్జీ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ నాన్‌ టీచింగ్‌ సంఘం అధ్యక్షుడిగా బాబ్జీ

May 18 2026 9:49 AM | Updated on May 18 2026 9:49 AM

డాబాగార్డెన్స్‌: ఉమ్మడి విశాఖ జిల్లా ఇంటర్మీడియట్‌ విద్య నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఆదివారం విశాఖ ప్రభుత్వ బాలికల కళాశాలలో ప్రశాంతంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ విద్య ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికలకు జోనల్‌ కార్యదర్శి ఎన్‌. మురళీమోహన్‌ ఎన్నికల అధికారిగా, పరిశీలకుడిగా వ్యవహరించారు. ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా విశాఖ ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాల ఉద్యోగి బొట్టా కేఎస్‌ బాబ్జీ ఎన్నికయ్యారు. జిల్లా కార్యదర్శిగా అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఉద్యోగి ఎన్‌.రమేష్‌బాబు, కోశాధికారిగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఉద్యోగి ఆర్‌.ఎస్‌.ఎస్‌.ఎన్‌ మూర్తి, ఉపాధ్యక్షుడిగా భీమునిపట్నం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల జూనియర్‌ అసిస్టెంట్‌ ఎం.ఎస్‌.కె చక్రవర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులను సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీహెచ్‌ సుధాకర్‌, రాష్ట్ర జోనల్‌ మహిళా కార్యదర్శి ఎన్‌.ఈశ్వరమ్మ, రాష్ట్ర సంఘం నాయకుడు జీవీ అప్పారావు, జిల్లా నాయకులు బంకపల్లి రామారావు అభినందించారు. అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు చెందిన ఇంటర్మీడియట్‌ విద్య నాన్‌–టీచింగ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement