పాలిటెక్నిక్‌ లేటరల్‌ ఎంట్రీ అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌ లేటరల్‌ ఎంట్రీ అడ్మిషన్లు

May 16 2026 4:59 AM | Updated on May 16 2026 4:59 AM

మురళీనగర్‌: ఎస్‌బీటీఈటీ ఆధ్వర్యంలో ఐటీఐ బ్రిడ్జ్‌ కోర్స్‌ పూర్తి చేసిన అభ్యర్థులకు డిప్లమా ద్వితీయ సంవత్సరంలో లేటరల్‌ ఎంట్రీ అడ్మిషన్లకు జూన్‌ 10వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ కేవీ రమణ తెలిపారు. కంచరపాలెం, విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌, తిరుపతి ఎస్‌.వి.ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారని చెప్పారు. ఈ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 1 గంట వరకు గణితం, మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు భౌతిక శాస్త్రం, 3.45 నుంచి 5.15 వరకు రసాయన శాస్త్రం పరీక్ష ఉంటుందని చెప్పారు. అర్హులైన అభ్యర్థులు ఎస్‌బీటీఈటీ వెబ్‌సైట్‌లో ఈనెల 30వ దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement