వైఎస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా కమిటీల్లో విశాఖ నేతలకు చోటు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా కమిటీల్లో విశాఖ నేతలకు చోటు

May 16 2026 4:59 AM | Updated on May 16 2026 4:59 AM

● ఉత్తరాంధ్ర జోన్‌–1 ఆర్‌టీఐ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నాగేంద్ర

విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కమిటీల్లో విశాఖ జిల్లాకు చెందిన పలువురు నేతలను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరాంధ్ర జోన్‌–1 ఆర్‌టీఐ వింగ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా జీలకర్ర నాగేంద్ర (గాజువాక), రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శిగా ఎన్నెటి రమణ (గాజువాక), రాష్ట్ర సోషల్‌ మీడియా వింగ్‌ కార్యదర్శిగా పాలకొండ మోహన్‌కృష్ణ (విశాఖ తూర్పు), రాష్ట్ర వలంటీర్‌ వింగ్‌ కార్యదర్శిగా సంపంగి ఈశ్వరరావు (గాజువాక)లను నియమించారు. జిల్లా పార్టీ కమిటీ కార్యదర్శిగా గొండేసి నాగిరెడ్డి (గాజువాక), జిల్లా అధికార ప్రతినిధిగా ఆడారి దివ్యకళ (విశాఖ ఉత్తరం)ను ఎంపిక చేశారు. అలాగే జిల్లా యాదవ విభాగం అధ్యక్షుడిగా ఎడ్ల వేణుగోపాల కృష్ణ (విశాఖ తూర్పు), జిల్లా ఆర్‌టీఐ వింగ్‌ ఉపాధ్యక్షుడిగా కొసిరెడ్డి గణేష్‌ (గాజువాక), జిల్లా మైనారిటీ సెల్‌ కార్యదర్శిగా షేక్‌ ప్రవీణ్‌ సుల్తానా (విశాఖ తూర్పు)లను నియమించారు. అదేవిధంగా గాజువాక నియోజకవర్గ ఆర్‌టీఐ వింగ్‌ అధ్యక్షుడిగా మామిడి రాము, విశాఖ తూర్పు నియోజకవర్గ వడ్డెర విభాగం అధ్యక్షుడిగా కుంచల చిన్నకొండయ్య, విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయి బ్రాహ్మణ విభాగం అధ్యక్షుడిగా ఎ.సుబ్బారావును నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement
 
Advertisement
Advertisement