నేడు ‘ఎర్త్‌ అవర్‌’ | - | Sakshi
Sakshi News home page

నేడు ‘ఎర్త్‌ అవర్‌’

Mar 28 2026 7:10 AM | Updated on Mar 28 2026 7:10 AM

రాత్రి 8.30కు విద్యుత్‌ దీపాలు ఆఫ్‌ చేయండి

డాబాగార్డెన్స్‌: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘ఎర్త్‌ అవర్‌–2026’ కార్యక్రమంలో నగర ప్రజలందరూ భాగస్వాములు కావాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ విజ్ఞప్తి చేశారు. శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు గంట పాటు అనవసరమైన విద్యుత్‌ దీపాలను స్వచ్ఛందంగా ఆపివేయాలని ఆయన కోరారు. 2007లో ‘వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌–ఇండియా’ ప్రారంభించిన ఈ ఉద్యమం, ప్రస్తుతం 190కి పైగా దేశాల్లో విస్తరించి అతిపెద్ద పర్యావరణ ఉద్యమంగా మారిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది ఎర్త్‌ అవర్‌ ఉద్యమం 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషమని కమిషనర్‌ పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై అవగాహన, విద్యుత్‌ ఆదా, జీవ వైవిధ్య పరిరక్షణే లక్ష్యంగా సాగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, గృహ సముదాయాల నివాసితులు స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. నివాసిత సంక్షేమ సంఘాలు, యువత, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కదిలి మన భూమిని, భవిష్యత్‌ తరాలను కాపాడడంలో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement