నిద్రలో నిఘా.. ముప్పులో భద్రత | - | Sakshi
Sakshi News home page

నిద్రలో నిఘా.. ముప్పులో భద్రత

Mar 28 2026 7:10 AM | Updated on Mar 28 2026 7:10 AM

● హార్బర్‌లో పనిచేయని సీసీ కెమెరాలు ● పెరుగుతున్న దొంగతనాలు ● నష్టపోతున్న బోటు యజమానులు

మహారాణిపేట: కోట్లాది రూపాయల మత్స్య వ్యాపారానికి నిలయం, వేలాది కుటుంబాలకు జీవనాధారమైన విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో భద్రత డొల్లగా మారింది. ప్రతిష్టాత్మకమైన ఈ హార్బర్‌లో నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి. దీంతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతోంది. పోర్ట్‌ అథారిటీ పర్యవేక్షణ లోపం మత్స్యకారుల పాలిట శాపంగా పరిణమిస్తోంది.

అలంకారప్రాయంగా 60 కెమెరాలు

హార్బర్‌లో నేరాల నియంత్రణ కోసం విశాఖ పోర్టు సుమారు 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అయితే వీటిలో మెజారిటీ కెమెరాలు మరమ్మత్తులకు గురికావడం, మరికొన్నింటికి నెట్‌వర్క్‌ కనెక్షన్లు లేకపోవడంతో నిఘా వ్యవస్థ పూర్తిగా పడకేసింది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న తరుణంలో, కీలకమైన హార్బర్‌లో కెమెరాలు పనిచేయకపో వడంపై మత్స్యకార వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నేరగాళ్లకు కేరాఫ్‌ అడ్రస్‌

నిఘా లేకపోవడంతో హార్బర్‌ ప్రాంతం మందుబాబులకు, గంజాయి బ్యాచ్‌లకు ఆవాసంగా మారింది. రాత్రి సమయాల్లో బోట్లపైనే మద్యం సేవిస్తూ ఘర్షణలకు దిగడం నిత్యకృత్యమైంది. అంతేకాకుండా, బోట్లలోని విలువైన సామాగ్రి, వేట కోసం నిల్వ ఉంచుకున్న డీజిల్‌ దొంగతనానికి గురవుతున్నాయి. సీసీ ఫుటేజీ అందుబాటులో లేకపోవడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది.

ఫిషింగ్‌ హర్బర్‌లో అలంకారంగా ఉన్న సీసీ కెమెరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement