ఫిషింగ్ హార్బర్‌లో కోట్లాది రూపాయల మత్స్య వ్యాపారం జరుగుతున్నా, భద్రత విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 60 సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల హార్బర్ అసాంఘిక శక్తులకు, దొంగతనాలకు అడ్డాగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో బోట్లపై మద్యం సేవించడం, సామగ్రిని దోచుకోవడం వంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. వచ్చే నెల 15 నుంచి వేట నిషేధ కాలం ప్రారంభం కానుంది. ఆ సమయంలో హార్బర్ నిర్మానుషంగా మారుతుంది కాబట్టి బోట్లకు రక్షణ కల్పించడం యజమానులకు పెద్ద సవాలుగా పరిణమించనుంది. ఇప్పటికై నా విశాఖ పోర్ట్ అథారిటీ స్పందించి వెంటనే సీసీ కెమెరాలను మరమ్మతు చేయాలి. అలాగే వేట లేని సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– వాసుపల్లి జానకీరామ్, అధ్యక్షుడు,
ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్
బోట్ ఓనర్స్ అసోసియేషన్ (ఇండియా),


