కమనీయం.. సీతారాముల కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. సీతారాముల కల్యాణం

Mar 28 2026 7:10 AM | Updated on Mar 28 2026 7:10 AM

తాటిచెట్లపాలెం: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతమ్మధారలోని క్షత్రియ కల్యాణ మండపంలో శుక్రవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు దంపతులు, సుదర్శన రాజు దంపతులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కె.కె. రాజు మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఇక్కడ రామనవమి వేడుకలను అత్యంత కమనీయంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఈ ఏడాది కూడా భక్తుల కోలాహలం మధ్య వేడుకలు ఘనంగా జరిగాయని పేర్కొన్నారు. కల్యాణ మహోత్సవంలో క్షత్రియ సంక్షేమ సమితి ప్రెసిడెంట్‌ తిరుపతి రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు, ఎన్‌. శ్రీనివాసరాజు, వీసీజీఎస్‌ఎన్‌ రాజు, ఎంఆర్‌కే రాజు, సీహెచ్‌ వెంకటపతి రాజు, తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ డిప్యూటీ మేయర్‌ కె.సతీష్‌, ముఖ్య నేతలు రొంగలి జగన్నాథం, అనిల్‌కుమార్‌ రాజు, అల్లు శంకర్‌రావు, సతీష్‌వర్మ, పేడాడ రమణికుమారి, శశికళ, వావిలపల్లి ప్రసాద్‌, రేయి వెంకట రమణ,భర్కత్‌ అలీ, శశికళ, అంబటి శైలేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement