జనారణ్యంలోకి కనుజు | - | Sakshi
Sakshi News home page

జనారణ్యంలోకి కనుజు

Feb 19 2026 10:04 AM | Updated on Feb 19 2026 10:04 AM

జనారణ్యంలోకి కనుజు

జనారణ్యంలోకి కనుజు

ఆరిలోవ: జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న విశాఖ వాలీ రోడ్డులో బుధవారం ఓ కనుజు సంచరించింది. ఈ రోడ్డుకు ఇరువైపులా జూ పార్కు, సీతకొండలు ఉన్నాయి. ఈ కొండల్లో వందల సంఖ్యలో చుక్కల జింకలు, కనుజులు, అడవి పందులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. ఇవి మేత, దాహం తీర్చుకోవడానికి తరచూ సాగర్‌నగర్‌, విశాలాక్షినగర్‌ వంటి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే బుధవారం సాయంత్రం పెద్ద కొమ్ములు కలిగిన ఓ కనుజు విశాఖ వాలీ స్కూల్‌ రోడ్డులోకి ప్రవేశించింది. అది రద్దీగా ఉన్న వాహనాల మధ్య నుంచి రోడ్డు దాటుకుంటూ సీతకొండలోకి చేరుకుంది. రోడ్డుపై సంచరించిన ఆ కనుజును పలువురు ఆసక్తిగా తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement