శౌర్య సింహనాదం
సముద్ర తీరాన
ఏయూక్యాంపస్ : సముద్ర తీరాన సాయంత్రపు సువర్ణ కాంతుల్లో ధైర్యం, శౌర్యం, సంప్రదాయం ఒకే వేదికపై సాక్షాత్కరించాయి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ నేపథ్యంలో బీచ్‌రోడ్డులో నిర్వహించిన ముందస్తు సన్నాహక కార్యక్రమం నగరాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్లిన యుద్ధవిమానాల ఘోష, సముద్రపు అలలపై ప్రతిధ్వనించిన దేశభక్తి స్వరాలు అక్కడికి చేరుకున్న ప్రతి హృదయాన్ని కదిలించాయి. భారత నావికాదళం, కోస్ట్‌గార్డుకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు సమన్వయంతో చేసిన విన్యాసాలు వేగం, క్రమశిక్షణ, కచ్చితత్వానికి ప్రతీకలుగా నిలిచాయి. చేతక్ హెలికాప్టర్ నుంచి మైరెన్ కమాండోలు సముద్రంలోకి దిగిన తీరు, అక్కడి నుంచి మెరుపువేగంతో నేలమీదకు చేరిన యుద్ధ విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. డోర్నియర్ విమానాలు, మిగ్–29 యుద్ధవిమానాలు, కమోవ్ కెఏ–31 హెలికాప్టర్లు, సుఖోయ్ యుద్ధవిమానాల గర్జనలు ఆకాశాన్ని తాకుతూ సైనిక శౌర్యాన్ని ప్రతిధ్వనింపజేశాయి.
ఆకట్టుకున్న కవాతు సాధన
ఈ నెల 19న బీచ్‌రోడ్డుపై జరగనున్న సిటీ పరేడ్‌కు సోమవారం నిర్వహించిన రిహార్సల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ దేశాలకు చెందిన నావికాదళ సిబ్బంది సమన్వయంతో కవాతు చేస్తూ అంతర్జాతీయ సౌహార్దాన్ని చాటారు. విదేశీ మహిళా నావికాదళ సిబ్బంది సైతం పాల్గొనడం విశేషం. నేవీ చిల్డ్రన్ స్కూల్ విద్యార్థుల వాయిద్య గానం, ఎన్‌సీసీ క్యాడెట్ల కవాతు, భారతీయ శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు సముద్రతీరాన్ని సాంస్కృతిక వేదికగా మలిచాయి. వివిధ దేవతా రూపాలను ప్రతిబింబించిన నృత్యాలు భారతీయ సంప్రదాయ మహిమను విదేశీ అతిథులకు పరిచయం చేశాయి.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, నేవీ కవాతు
హెలికాప్టర్ల నుంచి విన్యాసాలు
శౌర్య సింహనాదం
శౌర్య సింహనాదం
శౌర్య సింహనాదం
శౌర్య సింహనాదం
శౌర్య సింహనాదం
శౌర్య సింహనాదం
శౌర్య సింహనాదం
శౌర్య సింహనాదం


