గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం
గోపాలపట్నం: ఇండియన్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ సోమవారం రాత్రి 9.30 గంటలకు విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కలెక్టర్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకబ్రత ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్ కూడా విశాఖకు విచ్చేశారు. విమానాశ్రయంలో ఆయనకు కలెక్టర్ హరేందిర ప్రసాద్, సీపీ శంకబ్రత బాగ్చి, దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వీసీ డాక్టర్ సూర్యప్రకాష్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు సాదర స్వాగతం పలికారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మంగళవారం నిర్వహించే ప్రెసిడెన్షియల్ బ్యాంక్విట్ విందులో పాల్గొననున్నారు.
గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం


