జేఈఈ మెయిన్‌లో శ్రీచైతన్య విజయపరంపర
మద్దిలపాలెం : జేఈఈ మెయిన్–2026లో శ్రీ చైతన్య ఐఐటీ అకాడమీ ఉత్తరాంధ్ర విద్యార్థులు ప్రతిభ చాటారు. ఓపెన్ కేటగిరీలో 99.998 పర్సెంటైల్‌తో అగ్రస్థానాలు సాధించి అకాడమీ విజయపరంపరను కొనసాగించిందని ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం కె.వి.రమణ తెలిపారు. జాతీయ స్థాయిలో పి.భార్గవ్ నాయుడు 99.998 పర్సెంటైల్, కె.హిమకర్ 99.998 పర్సెంటైల్, ఎం.నాగసహస్ర 99.998 పర్సెంటైల్ సాధించినట్లు వెల్లడించారు. ఈ అపూర్వ విజయానికి కృషి చేసిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అకాడమి డీన్ ఎన్.రఘుకుమార్, కె.బంగారుబాబు అభినందనలు తెలిపారు.


