ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమే..
చంద్రబాబు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కూడా ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై ఉత్తుత్తి ప్రేమనే చూపింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ.605 కోట్లు చూపుతున్నారు. వాస్తవికంగా చూస్తే మెజార్టీ నిధులు రూ.400 కోట్లకు పైగా కేవలం పునరావసం, జీతభత్యాలకే వెచ్చించనుంది. అసలైన ప్రాజెక్టు పనులకు రూ.200 కోట్లను కూడా కేటాయించలేదని స్పష్టమవుతోంది. తాండవ ప్రాజెక్టు వద్ద రూ.470 కోట్లకుపైగా వ్యయంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టు పనులను ఈ ప్రభుత్వం నిలిపివేసింది. కేవలం తాండవ, ఏలేరు ప్రాజెక్టుల నిర్వహణ కోసం తూతూ మంత్రంగా రూ.8.13 కోట్లను కేటాయించి చేతులు దులిపేసుకుంది. – గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి


