స్టాళ్ల రకాలు, ప్రత్యేకతలివీ.. | - | Sakshi
Sakshi News home page

స్టాళ్ల రకాలు, ప్రత్యేకతలివీ..

Feb 16 2026 7:11 AM | Updated on Feb 16 2026 7:11 AM

స్టాళ్ల రకాలు, ప్రత్యేకతలివీ..

స్టాళ్ల రకాలు, ప్రత్యేకతలివీ..

మిలాన్‌ విలేజ్‌లో హస్తకళల స్టాళ్లు ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన హస్తకళలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా సంకల్ప ఆర్ట్‌ విలేజ్‌ (కళాగ్రామం) వంటి సంస్థలు భారతీయ కళాఖండాలు, చేనేత వస్త్రాలు, స్కార్ఫ్‌లు, గృహాలంకరణ వస్తువులను ప్రదర్శిస్తున్నాయి. అదేవిధంగా.. విశాఖ ప్రత్యేకతను చాటేలా చెక్కతో చేసిన లైట్‌ హౌస్‌ బొమ్మలు, సంప్రదాయ జ్ఞాపికలు స్టాళ్లలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. విదేశీ ప్రతినిధులకు భారతీయ రుచులను పరిచయం చేసేలా వివిధ ప్రాంతాల వంటకాలతో ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సేంద్రియ పద్ధతిలో తయారుచేసిన లడ్డూలు, బెల్లం, నెయ్యి, డ్రైఫ్రూట్స్‌తో చేసిన ప్రోటీన్‌ బార్‌లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. మిలాన్‌–2026కు గుర్తుగా టీ–షర్టులు, క్యాప్‌లు, ఇతర మెమెంటోలు కొనుగోలు చేయడానికి ప్రత్యేక స్టాల్స్‌ అందుబాటులో ఉన్నాయి. నౌకాదళ సామర్థ్యాన్ని, స్వదేశీ పరిజ్ఞానాన్ని వివరించేలా కొన్ని విద్యాపరమైన ప్రదర్శన స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement