బడ్జెట్‌లో చెప్పినవన్నీ అబద్ధాలే..
చంద్రబాబు ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోలేదు. హామీలు గుప్పించడం తప్ప అమలు చేయడం ఆయన ప్రభుత్వ చరిత్రలో లేదని మరోసారి రుజువు చేసుకున్నారు. గత ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ పేరిట ఎన్నో ఆశలు పెంచారు. అందులో చెప్పిన నాలుగు పథకాలు రెండేళ్లు గడచినా అమలు చేయలేదు. ఇప్పుడు బడ్జెట్‌లో కూడా అబద్ధాలే చెప్పారు. సంపద సృష్టిస్తామంటే ఏమిటో అనుకున్నాం. రాష్ట్రం అప్పుల కుప్పగా కనిపిస్తోంది. విశాఖలో ప్రభుత్వ భూములు పప్పు బెల్లాలుగా పంపిణీ చేస్తున్నారు. అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇక్కడి ప్రజలకు మొండిచేయి చూపిస్తున్నారు.
– గండ్రేటి ఈశ్వరరావు, తగరపువలస


