సూపర్ సిక్స్‌కు మంగళం
కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ పథకాల పేరు చెప్పి తెగ ఊదరగొట్టారు. పేద మధ్యతరగతి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టారు. బూటకపు హామీలతో అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తోంది. గత రెండు బడ్జెట్లలో చాలా పథకాలకు కేటాయింపుల్లేవు. వరుసగా మూడవ బడ్జెట్‌లో కూడా సుపర్ సిక్స్ పథకాలకు మొండిచెయ్యి చూపారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్లు, మహిళలకు సున్నా వడ్డీ రుణాలు తదితర పథకాలకు ఈ బడ్జెట్‌లో కూడా కేటాయింపులు లేవు. హామీలిచ్చి మొండిచెయ్యి చూపడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.
– బాణాల శ్రీనివాసరావు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్


