అలరించిన శివోహం నృత్య నీరాజనం
ఏయూ క్యాంపస్: విద్యా విధానంలో శాస్త్ర సంబంధ జ్ఞానంతో పాటు లలితకళలు అంతర్భాగం కావాలని గాయత్రి విద్యా పరిషత్(జీవీపీ) కార్యదర్శి ఆచార్య పి.సోమరాజు అన్నారు. విశాఖ ఆర్ట్ అండ్ డ్యాన్స్ అసోసియేషన్(వాడ), జీవీపీ ఎంఎల్‌బీటీ స్కూల్ సంయుక్త నిర్వహణలో ఆదివారం బీచ్ రోడ్డులోని పాఠశాల ఆవరణలో శివోహం నృత్య నీరాజనం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యం నుంచే చిన్నారులకు నైతిక విలువలు పెంపొందించడం, సంప్రదాయ కళను నేర్పించడం ఎంతో అవసరం అన్నారు. వాడ ప్రధాన కార్యదర్శి కన్నం వెంకటరమణరావు మాట్లాడుత కళల ద్వారానే విద్య ప్రచోదనమవుతుందన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.మధురవాణి, వాడ ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.గోపీనాథ్, కుమారి సింధూజ, మహాలక్ష్మి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి 257 మంది చిన్నారులు తమ ప్రదర్శనలతో ఆహూతులను అలరించారు.
సోమరాజును సన్మానిస్తున్న అతిథులు, స్కూల్ సిబ్బంది


