విశాఖ అభివృద్ధిపై అదే నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

విశాఖ అభివృద్ధిపై అదే నిర్లక్ష్యం

Feb 15 2026 12:40 PM | Updated on Feb 15 2026 12:40 PM

విశాఖ అభివృద్ధిపై అదే నిర్లక్ష్యం

విశాఖ అభివృద్ధిపై అదే నిర్లక్ష్యం

చంద్రబాబు ప్రభు త్వం ఈ బడ్జెట్‌లోనూ విశాఖ అభివృద్ధిపై అదే నిర్లక్ష్యం చూపించింది. అరకొర నిధులు, కంటి తుడుపు చర్యలు తప్ప విశాఖకు ప్రత్యేకంగా కేటాయించిందేమీ లేదు. విశాఖ మెట్రో విషయంలోనూ.. ఇంకా ఆమోదం పొందని విజయవాడ మెట్రోతో ముడిపెట్టారు. విశాఖ నగరాన్ని వాడుకుని, అమరావతిని అభివృద్ధి చేసుకోవాలన్న చంద్రబాబు వైఖరి ఈ బడ్జెట్‌తో పూర్తిగా అర్థమైంది. మొత్తంగా ఈ బడ్జెట్‌తో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగింది. సాగునీటి ప్రాజెక్టులకు ఎటువంటి కేటాయింపులూ లేవు. నమ్మి ఓట్లు వేసినందుకు.. ఈ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆడబిడ్డ నిధి ప్రస్తావనే లేదు.

– కేకే రాజు, వైఎస్సార్‌ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement