సంస్థాగత నిర్మాణ కమిటీలను త్వరితగతిన పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

సంస్థాగత నిర్మాణ కమిటీలను త్వరితగతిన పూర్తిచేయాలి

Feb 15 2026 12:40 PM | Updated on Feb 15 2026 12:40 PM

సంస్థాగత నిర్మాణ కమిటీలను త్వరితగతిన పూర్తిచేయాలి

సంస్థాగత నిర్మాణ కమిటీలను త్వరితగతిన పూర్తిచేయాలి

సాక్షి, విశాఖపట్నం: పార్టీ సూచించిన గడువులోపే సంస్థాగత నిర్మాణ కమిటీలను పూర్తిచేయాలని వైఎస్సార్‌ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. జిల్లా అనుబంధ విభాగాలన్నింటితో పాటు సచివాలయ స్థాయి పార్టీ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. శనివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అనుబంధ విభాగాల కమిటీలు, పార్టీ ముఖ్యనాయకులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లా వలంటీర్‌ విభాగం, యువజన విభాగం, కళింగ కోమటి, రజక విభాగాల కమిటీలతో ప్రత్యేకంగా సమావేశమై పురోగతిని పరిశీలించారు. అనంతరం వార్డు స్థాయి అనుబంధ విభాగాల కమిటీలు, ముఖ్యనాయకులతో కూడా చర్చించారు. తొలుత ఇటీవల నూతనంగా నియమితులైన అనుబంధ విభాగాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు కేకే రాజును సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సచివాలయ పార్టీ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న వార్డు అనుబంధ విభాగాల నియామకాలను కూడా పూర్తి చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. నియామకాలు పూర్తయిన ప్రతి సభ్యుడి వివరాలను డిజిటలైజేషన్‌ చేసి, పార్టీ తరఫున గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌, వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ గాంధీ, జోనల్‌ విభాగం అధ్యక్షులు అంబటి శైలేష్‌, ద్రోణంరాజు శ్రీవాత్సవ్‌, ఎం. సునీల్‌, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉరుకూటి చందు, పీలా ప్రేమ్‌కుమార్‌, తలసు సాయిమోహనరావు, కోడూరు సత్యనారాయణ, బోండా ఉమామహేశ్వరరావు, నీలి రవి, కర్రి రామరెడ్డి పాల్గొన్నారు. అలాగే ముఖ్యనేతలు పులగం శ్రీనివాసరెడ్డి, కరణం కృష్ణ, బొడ్డేటి కిరణ్‌, బోగవల్లి గోవింద్‌, బోడ వెంకటేష్‌, జోసెఫ్‌, శ్రీనివాసరావు, నాగమణి, వెంకటరమణ, గుజ్జు వెంకటరెడ్డి, సొల్లంగి నాగేశ్వరరావు, వేములవలస అప్పారావు, శ్రీరామదాసు నూకరాజు, జాగవరపు నాగరాజు తదితరులు హాజరయ్యారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement