జీవీఎంసీని సందర్శించిన ఇండోర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లు | - | Sakshi
Sakshi News home page

జీవీఎంసీని సందర్శించిన ఇండోర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లు

Feb 13 2026 5:31 AM | Updated on Feb 13 2026 5:31 AM

జీవీఎంసీని సందర్శించిన ఇండోర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లు

జీవీఎంసీని సందర్శించిన ఇండోర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లు

డాబాగార్డెన్స్‌: ఇండోర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన కౌన్సిలర్లు గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అదనపు కమిషనర్లు పీఎం సత్యవేణి, పి.నల్లనయ్య, డీవీ రమణమూర్తి, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్‌ వారితో సమావేశమై నగర అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణపై వివరించారు. పారిశుధ్య కార్మికుల పనితీరు, వ్యర్థాల సేకరణ–తరలింపు, క్లోజ్డ్‌ కాంపాక్టర్‌ సిస్టం, గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు, వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ నిర్వహణ, నీటి సరఫరా వ్యవస్థ, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు, త్రిబుల్‌ ఆర్‌ సెంటర్లు, సోలార్‌ ప్లాంట్లు, నీటి శుద్ధి కేంద్రాలు, ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌ అమలు వంటి అంశాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఇండోర్‌ సీనియర్‌ కౌన్సిలర్లు సురేష్‌ తక్కల్కర్‌, కాంచన గిద్వానీ విశాఖ నగర పరిశుభ్రత, సుందరీకరణను ప్రశంసించారు. వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌, సోలార్‌ ప్రాజెక్టులు, మురుగునీటి శుద్ధి విధానం ఆదర్శనీయమని పేర్కొన్నారు. అనంతరం పరస్పరం జ్ఞాపికలు అందజేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement