జిల్లా అనుబంధ విభాగ కమిటీల్లో పలువురికి చోటు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అనుబంధ విభాగంలో పలువురికి చోటు కల్పించారు. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా కళింగ కోమటి విభాగం అధ్యక్షుడిగా తలాసు సాయి మోహన్‌రావు(విశాఖ నార్త్), జిల్లా రజక విభాగం అధ్యక్షుడిగా కోడూరు సత్యనారాయణ(విశాఖ నార్త్), జిల్లా గవర విభాగం అధ్యక్షుడిగా కొణతాల ఉమా మహేశ్వరరావు(విశాఖ పశ్చిమ), జిల్లా నాయీ బ్రాహ్మణ విభాగం అధ్యక్షుడిగా పి.సూర్యారావు(విశాఖ పశ్చిమ), జిల్లా నూర్ భాష/దూదేకుల విభాగం అధ్యక్షుడిగా షేక్ ఖాన్(విశాఖ పశ్చిమ), జిల్లా శిష్టకరణాల విభాగం అధ్యక్షుడిగా ఎం.ఎస్.ఎస్.ఎస్ పట్నాయక్(గాజుకవాక), జిల్లా యాత విభాగం అధ్యక్షుడిగా అండిబోయిన అప్పారావు(గాజువాక), జిల్లా విశ్వబ్రాహ్మణ విభాగం అధ్యక్షుడిగా దంతిన రామారావు(విశాఖ తూర్పు)తో పాటు విశాఖ దక్షిణ నియోజకవర్గం అంగన్‌వాడీ వింగ్ అధ్యక్షుడిగా కండిపల్లి ఆదిలక్ష్మిని నియమించారు.


