అందరికీ ఉపాధి లభిస్తుంది
ఈ నెల 19వ తేదీ నుంచి బలమైన శుభముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి. 90 రోజులుగా మూఢాల వల్ల శుభకార్యాలకు బ్రేక్ పడటంతో, ఈ రంగంపై ఆధారపడిన పురోహితులు, కళాకారులు, ఇతర వృత్తుల వారికి ఉపాధి లేకుండా పోయింది. ఇప్పుడు వరుస ముహూర్తాలు వస్తుండటంతో వారందరికీ మళ్లీ చేతి నిండా పని దొరుకుతుంది.
– వెలవలపల్లి కోటీశ్వర శర్మ, ప్రముఖ వేద పండితుడు, మునగపాక
చైత్ర, వైశాఖ మాసాల్లోనే అధికం
చైత్ర మాసంలో సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం, శ్రీరామ నవమి తర్వాత వివాహాది శుభ కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చైత్ర, వైశాఖ మాసాల్లో ముహూర్తాలు బలంగా ఉన్నాయి. ఇన్నాళ్లూ మూఢాల వల్ల ఖాళీగా ఉన్న అర్చకులు, పండితులు, ఇతర అనుబంధ రంగాల వారికి ఈ సీజన్ మంచి ఉపాధినిస్తుంది.
– అయిలూరి శ్రీనివాస దీక్షితులు, శైవాగమ పండితుడు, విశాఖపట్నం
అందరికీ ఉపాధి లభిస్తుంది


