సమన్వయంతోనే ఐఎఫ్‌ఆర్‌ విజయవంతం | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతోనే ఐఎఫ్‌ఆర్‌ విజయవంతం

Feb 12 2026 7:03 AM | Updated on Feb 12 2026 7:03 AM

సమన్వయంతోనే ఐఎఫ్‌ఆర్‌ విజయవంతం

సమన్వయంతోనే ఐఎఫ్‌ఆర్‌ విజయవంతం

బీచ్‌రోడ్డులో ఏర్పాట్లను పరిశీలించి కలెక్టర్‌

ఏయూ క్యాంపస్‌: విశాఖ వేదికగా జరగనున్న ఐఎఫ్‌ఆర్‌–2026, సిటీ పరేడ్‌ ఏర్పాట్లను కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేందిర ప్రసాద్‌ బుధవారం పరిశీలించారు. వీఎంఆర్డీఏ కమిషనర్‌ తేజ్‌ భరత్‌, జీవీఎంసీ, నేవీ అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు జరుగుతున్న పనులను కలెక్టర్‌ సమీక్షించారు. ప్రధాన వేదిక, వీఐపీల గ్యాలరీలు, వాహనాల రాకపోకలు, పార్కింగ్‌ వసతి, బారికేడ్లు, క్యూలు, కంట్రోల్‌ రూమ్‌, ఎల్‌ఈడీ స్క్రీన్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జెట్టీ ప్రాంతంలోని పడవలను తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు తరలించాలని, ఫైర్‌ షో, డ్రోన్‌ షో నిర్వహణకు అవసరమైన అనుమతులు ముందుగానే తీసుకోవాలని సూచించారు. సమన్వయం కోసం అదనపు వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ సెట్లను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ప్రాంగణంలో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు, మెడికల్‌ క్యాంపులు, స్ట్రెచర్లతో కూడిన అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని, ఏపీఐఐసీ గ్రౌండ్‌ వద్ద మైదానాన్ని చదును చేయాలని ఆదేశించారు. ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి, లైవ్‌ స్ట్రీమింగ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, సాధారణ ప్రజల కోసం 100 మొబైల్‌ టాయిలెట్లు, పార్కింగ్‌ ప్రాంతాల్లో ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు.

ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌కు ఏర్పాట్లు పూర్తి

మహారాణిపేట: నగరంలో ఈ నెల 17 నుంచి 25 వరకు జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ(ఐఎఫ్‌ఆర్‌), మిలాన్‌ విన్యాసాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ తెలిపారు. బుధవారం తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. 18న రిహార్సల్స్‌, 19న ఆర్‌.కె.బీచ్‌లో సిటీ పరేడ్‌ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సిటీ పరేడ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారని, సుమారు లక్ష నుంచి రెండు లక్షల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పరేడ్‌లో భాగంగా బాణసంచా, డ్రోన్‌ షో, సముద్రంలో నేవీ విన్యాసాలు ఉంటాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. పలు దేశాలకు చెందిన నేవీ బృందాలు, దేశంలోని వివిధ ప్రాంతాల కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు, అభివృద్ధిని ప్రతిబింబించేలా శకటాల ప్రదర్శన ఉంటుందని వివరించారు. పార్కు హోటల్‌ నుంచి కోస్టల్‌ బ్యాటరీ వరకు ఈ ప్రదర్శనలు సాగుతాయని, ఇందుకు సంబంధించి బీచ్‌రోడ్డులో పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement