మబ్బు!
పెందుర్తిలో మేయర్ కక్షసాధింపు చర్యలు
మందుల
సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో నిల్వలు శూన్యం జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో కొరత బీపీ, సుగర్, ఇన్సులిన్ వంటి అత్యవసర ఔషధాలు దొరక్క పేదల ఆవేదన నెల రోజుల సరఫరా తగ్గి వారానికే పరిమితం
గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
మహారాణిపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్‌సీలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అత్యవసర మందులు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. బీపీ, సుగర్, ఇన్సులిన్, ఫిట్స్ నివారణ మందులు, యాంటీబయాటిక్స్ వంటి నిత్యావసర ఔషధాలు దొరకక రోగులు బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నవాల్తేర్‌లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో మందుల నిల్వలు నిండుకున్నాయి. ఆయా ఆస్పత్రులకు సరైన సరఫరా జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘‘స్టాక్ లేదు’’ అనే సమాధానం రోగులకు సాధారణంగా మారింది. సూదులు, గ్లౌజులు, ఇంజెక్షన్లు వంటి ప్రాథమిక వైద్య సామగ్రి కూడా కొరతగా ఉన్నట్టు తెలుస్తోంది.
మందుల లభ్యతలో గణనీయ తగ్గుదల
గత ప్రభుత్వ కాలంలో మొత్తం 614 రకాల మందులు అందుబాటులో ఉండేవని సమాచారం. ప్రస్తుతం ఆ సంఖ్య 413కు తగ్గిపోయింది. యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో అయితే కేవలం 172 రకాల మందులు మాత్రమే లభ్యమవుతున్నాయి. మందులు సెంట్రల్ పర్చేజింగ్ విధానంలో కొనుగోలు చేసి సెంట్రల్ ఫార్మసీకి తరలిస్తారు. అక్కడి నుంచి ఇండెంట్ ప్రకారం వివిధ ఆస్పత్రులకు సరఫరా చేస్తారు. అయితే ప్రస్తుతం ఇండెంట్ పెట్టినా సరఫరా ఆలస్యమవుతోందని, విజయవాడ నుంచి మందులు రావడం లేదని అధికారులు చెబుతున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే మందుల నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
వారానికే పరిమితమైన సరఫరా
గతంలో రోగులకు నెలరోజులకు సరిపడే మందులు అందించేవారు. ప్రస్తుతం మందుల కొరత కారణంగా వారం రోజులకు సరిపడేంత మాత్రానే ఇస్తున్నారు. కొన్ని రకాల మందులు పూర్తిగా నిల్వలో లేకపోవడంతో, ‘‘ప్రస్తుతం స్టాక్ లేదు, మళ్లీ రండి’’ అనే సమాధానం వినిపిస్తోంది. గతంలో ఆస్పత్రిలో మొత్తం 614 రకాల మందులు అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 413కు తగ్గిపోయింది. యూపీహెచ్‌సీల్లో అయితే కేవలం 172 రకాల మందులు మాత్రమే లభ్యమవుతున్నాయి. అనేక సాధారణ మరియు దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైన మందులు కూడా అందుబాటులో లేవని తెలుస్తోంది. ఆస్పత్రిలో మందులు లేకపోవడంతో వైద్యులు రోగులకు బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు. ‘‘రోగం త్వరగా తగ్గాలంటే మందులు తప్పనిసరిగా వాడాలి, ఇక్కడ లేవు కాబట్టి బయట కొనండి’’ అని చెప్పి రోగులను పంపిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా తీవ్ర ప్రభావం
జిల్లాలో 66 యూపీహెచ్‌సీలు, 9 పీహెచ్‌సీలు, అగనంపూడిలో ఒక ఏరియా ఆస్పత్రి, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలిలో మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో 54 విలేజ్ హెల్త్ క్లినిక్స్ పనిచేస్తున్నాయి. ఈ ఆరోగ్య కేంద్రాలకు రోజూ వందలాది పేద రోగులు చికిత్స కోసం వస్తున్నారు. అయితే ఇటీవల నెలలుగా మందుల కొరత తీవ్రంగా పెరిగింది. గతంలో నెలరోజులకు సరిపడే మందులు రోగులకు అందించేవారు. ప్రస్తుతం వారం రోజులకు మాత్రమే మందులు ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అవి కూడా పూర్తిగా అందడం లేదు. మళ్లీ రావాలని సూచిస్తూ రోగులను తిరిగి పంపిస్తున్నారు.
బయట కొనుగోలు చేశాను
‘‘నా వయస్సు 63 సంవత్సరాలు. భర్త లేడు. పిల్లలతో ఉంటున్నాను. బీపీ, సుగర్ సమస్యలతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లాను. అక్కడ మందులు లేవని చెప్పారు. వైద్యుడు బయట కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు బయట కొనుగోలు చేసి వాడుతున్నాను. ప్రభుత్వ ఆస్పత్రిలో మందులు లభిస్తే మాకు చాలా ఉపశమనం కలుగుతుంది.’’
– సిరిపురపు నరసమ్మ,
కొత్తపాలెం, గోపాలపట్నం
బీపీ మాత్రలు
లేవన్నారు..
‘‘నాకు బీపీ సమస్య ఉంది. సమీప పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాను. వైద్యుడు మందులు రాసినా అక్కడ బీపీ మాత్రలు లేవన్నారు. బయట కొనుగోలు చేసి వాడుతున్నాను. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడింది. కానీ ప్రతి నెలా బయట కొనడం భారంగా ఉంది.’’
– వాడమోదుల లక్ష్మి, చినవాల్తేరు
కొరతగా ఉన్న
ప్రధాన మందులు
ప్రస్తుతం కొరతగా ఉన్న మందుల జాబితా ఆందోళన కలిగిస్తోంది. కొన్ని మందులు వచ్చినా రెండు మూడు రోజుల్లోనే అయిపోతున్నాయి. మళ్లీ సరఫరా అయ్యే వరకు రోగులు వేచి చూడాల్సి వస్తోంది. సిబ్బంది కూడా రోగులకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు.
బీపీ మాత్రలు
సుగర్ మందులు, ఇన్సులిన్
ఫిట్స్, మూర్ఛ నివారణ మందులు
పలు రకాల యాంటీబయాటిక్స్
హిమోగ్లోబిన్ పెంచే మందులు
రక్తహీనత నివారణ ఔషధాలు
థైరాయిడ్ చికిత్స మందులు
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే
కొన్ని మందులు
మబ్బు!
మబ్బు!
మబ్బు!


