బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
సింహాచలం: జిల్లాలోని మహాత్మా జ్యోతి బాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు, 6 నుంచి 8 తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి, అలాగే సింహాచలంలోని జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గుణుపూరు పురుషోత్తం తెలిపారు. 5వ తరగతికి సింహాచలం గురుకుల పాఠశాలలో 160, పెదనరవలో 80, అన్నవరం బాలికల గురుకుల పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయని తెలిపారు. మార్చి 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 12న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. 6 నుంచి 8 తరగతుల ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఇంటర్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుందని, శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. పూర్తి వివరాలకు https:// apbcwr eist.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.


