ఎంఎస్‌ఎంఈ వృద్ధికి మద్దతుగా బైక్ ర్యాలీ
మర్రిపాలెం: ఎంఎస్‌ఎంఈలపై దృష్టి సారించిన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ సారథి ఫైనాన్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బ్రాండ్ గుర్తింపును బలోపేతం చేయడం, ఉద్యోగుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, స్థానిక వ్యాపార సముదాయాలతో అనుసంధానాన్ని విస్తరించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ర్యాలీలో సుమారు 30 మంది ఉద్యోగులు పాల్గొ న్నారు. క్రెడిట్, లీగల్, టెక్నికల్, బిజినెస్ విభాగాల మధ్య సహకారాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన సారథి ఫైనాన్స్ చీఫ్ క్రెడిట్ ఆఫీసర్ రోనక్ జైన్ మాట్లాడుతూ, స్థానిక వ్యాపార సముదాయాలతో బలమైన సంబంధాలు ఆర్థిక సమావేశానికి కీలకమని అన్నారు. బాధ్యతాయుతమైన, సులభంగా అందుబాటులో ఉండే ఆర్థిక పరిష్కారాలతో ఎంఎస్‌ఎంఈలకు మద్దతు ఇస్తామని తెలిపారు.


