ఐవోబీ ఆరోగ్య పరీక్ష శిబిరాలు
విశాఖ సిటీ: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విశాఖ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో పలు ఆరోగ్య పరీక్ష శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాలను వుడా బ్రాంచ్, అక్కయ్యపాలెం, ఎన్‌ఏడీ, పెదవాల్తేరు, మెయిన్ బ్రాంచ్‌లలో చేపట్టారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఐవోబీ విశాఖ ప్రాంతీయ మేనేజర్ రవికుమార్‌గుప్తా బ్యాంక్ సిబ్బందితో కలిసి జనరేషన్ యువ అనాథాశ్రమంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా నర్సాపురంలో బ్యాంక్‌కు చెందిన 75వ శాఖను ప్రారంభించినట్లు బ్యాంక్ చీఫ్ మేనేజర్ కె.వి.వి.ప్రసాద్ తెలిపారు.


