భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

Feb 10 2026 8:12 AM | Updated on Feb 10 2026 8:12 AM

భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

మల్కాపురం : భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన 60వ వార్డు జవహర్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వేములపూడి జయ (29), పెయింటర్‌గా పనిచేస్తున్న పట్టాలు భార్యాభర్తలు. పట్టాలు మద్యానికి బానిసై, భార్యపై అనుమానంతో తరచూ గొడవపడేవాడు. ఆదివారం రాత్రి కూడా గొడవపడి అతను బయటకు వెళ్లిపోగా, మనస్తాపానికి గురైన జయ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. తండ్రి వెంట ఏడుస్తూ రోడ్డుపైకి వచ్చిన ఐదేళ్ల కుమారుడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిసేపటి తరువాత ఇంటికి వచ్చిన పట్టాలు, జయ తలుపు తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా మృతదేహం వేలాడుతూ కనిపించింది. మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. తల్లి మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement