రయ్‌ రయ్‌..తాటతీశారోయ్‌..! | - | Sakshi
Sakshi News home page

రయ్‌ రయ్‌..తాటతీశారోయ్‌..!

Feb 10 2026 8:12 AM | Updated on Feb 10 2026 8:12 AM

రయ్‌

రయ్‌ రయ్‌..తాటతీశారోయ్‌..!

అల్లిపురం : నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్‌ ఏడీసీపీ కె. ప్రవీణ్‌కుమార్‌ హెచ్చరించారు. సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘రమ్‌..రయ్‌..రిస్క్‌ రోయ్‌..’ ఫొటో కథనానికి నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి స్పందించారు. సీపీ ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, డ్రైవింగ్‌ చేసే సమయంలో లైసెన్స్‌, హెల్మెట్‌ తప్పనిసరి అని, ట్రిపుల్‌ రైడింగ్‌ చేయకూడదని అవగాహన కల్పించారు. పట్టుబడిన ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌.ఐ ఉమాశంకర్‌ తెలిపారు. మరోసారి నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్‌ రద్దు చేయడంతో పాటు వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో ట్రాఫిక్‌ సీఐ శ్రీను, ఎస్‌.ఐ ఉమా శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

రయ్‌ రయ్‌..తాటతీశారోయ్‌..!1
1/1

రయ్‌ రయ్‌..తాటతీశారోయ్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement