ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం
మహారాణిపేట: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి, విజయనగరం జిల్లా సంఘం అధ్యక్షుడు సీహెచ్ మురళి ప్రకటించారు. ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఎస్.సత్తిబాబు(సూపరింటెండెంట్, పీఐయూ డివిజన్), ప్రధాన కార్యదర్శిగా డి.వి.సీతారామరాజు, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎల్.పూర్ణయ్య ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా ఆర్‌వీ నాగరాజు, డి.వి.ఎస్ గౌరీపతిరావు, పి.శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీలుగా పి.రామకృష్ణ, ఎం.వి.హెచ్.ఆర్.స్వామి, వై.రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా సుధారాణి, డి.వి.రమణారాజు, ఎస్.రవికుమార్, బి.వి.ఎస్.ఫణికుమార్, కోశాధికారిగా బి.అర్చన, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా జి.గంగాధర్, ఎస్.త్రినాథ్, సీహెచ్ సింహాచలం, జి.ఎల్.నర్సింహారావులను ఎన్నుకున్నారు. సత్తిబా బు, సీతారామరాజు అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికవడం ఇది నాలుగోసారి. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు నారాయణరావు, విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సహాయ ఎన్నికల అధికారులుగా బి.హెచ్.వి.రమణబాబు, యు.కూర్మారావు వ్యవహరించారు.


