మురుగు ‘నీరే’ ఆధారం
ఫిషింగ్ హార్బర్ సమీపంలోని జాలారిపేటలో కనిపిస్తున్న ఈ దృశ్యం చూస్తుంటే సామాన్యుడి ప్రాణాలకు విలువే లేదనిపిస్తోంది. తాగడానికి గుక్కెడు నీరు కావాలంటే కలుషితమైన మురుగు కాలువలోకి దిగాల్సిన దుస్థితి నెలకొంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒకవైపు నగరం సుందరీకరణ కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న పాలకులు, మరోవైపు ప్రాథమిక అవసరమైన తాగునీరు కూడా అందించలేకపోవడం దారుణం. మురికివాడల అభివృద్ధిని విస్మరించి, కేవలం ఆడంబరాలకే పరిమితమైన వ్యవస్థల తీరును ఈ చిత్రం ప్రశ్నిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్యులకు స్వచ్ఛమైన గాలి, నీరు అందని ద్రాక్షగా మారాయని ఈ దృశ్యం కళ్లకు కడుతోంది.
– ఫొటో : సాక్షిఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


