కంచి పీఠం సంప్రదాయ పాఠశాలల్లో ప్రవేశాలు
రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌కు ‘ఆంధ్రా’ సిద్ధం.. నేడు బెంగాల్‌తో ఢీ
విశాఖ స్పోర్ట్స్ : దేశవాళీ టెస్ట్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న క్వార్టర్ ఫైనల్స్‌లో బెంగాల్ జట్టుతో ఆంధ్ర జట్టు తలపడనుంది. ఎలైట్ ‘ఎ’ గ్రూప్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించి, మరో మూడింటిని డ్రా చేసుకున్న ఆంధ్రా జట్టు.. అపజయమనేదే లేకుండా 31 పాయింట్లతో క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఇదే గ్రూప్‌లో జార్ఖండ్, విధర్భ కూడా 31 పాయింట్లతో నిలిచినప్పటికీ, మెరుగైన రన్ రేట్ కారణంగా ఆంధ్రా, జార్ఖండ్ జట్లు తదుపరి దశకు అర్హత సాధించాయి. కల్యాణ్ వేదికగా ఐదు రోజుల పాటు జరిగే ఈ పోరులో ఆంధ్రా జట్టు రికీ భుయ్ నాయకత్వంలో బరిలోకి దిగుతోంది. జట్టులో వికెట్ కీపర్‌గా భరత్, బ్యాటర్లుగా అశ్విన్ హెబ్బర్, షేక్ రషీద్, ఆల్‌రౌండర్‌గా సౌరబ్ కీలక పాత్ర పోషించనుండగా.. పృధ్వీరాజ్, సత్యనారాయణ, విజయ్ బౌలింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. గత సీజన్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న ఆంధ్రా జట్టు, ఈసారి లీగ్ దశలో వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉంది.


