ఒక బల్బు బిల్లు కోసం రూ.7 వేలు అడుగుతున్నారు
విశాఖ ఉత్సవ్‌లో స్టాల్ పెట్టేందుకు శ్రేయాస్ మీడియాకు దరఖాస్తు చేసుకున్నాం. గవర్నమెంట్ ఆఽథరైజేషన్ అని చెప్పారు. అప్పుఘర్ వద్ద స్టాల్ కోసం ధర మాట్లాడి దరఖాస్తు పెట్టుకోవాలన్నారు. అదే పెట్టాం. చివరి నిమిషంలో అక్కడికి వెళ్లి పెట్టేందుకు ప్రయత్నిస్తే ఆపేశారు. ఇక్కడ కాదు.. పోర్టు స్టేడియంలో పెట్టండి అని చెప్పారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే స్టాల్ పగోడా ఇవ్వలేదు. దానికి సపరేట్‌గా చెల్లించాలని చెప్పారు. ఒక్కొక్కరూ ఒక్కో రేటు చెప్పారు. కరెంట్‌కు మరో రూ.7 వేలు కట్టాలని చెబుతున్నారు. ఒక ప్లగ్ ఇస్తాం, బల్బ్ ఇస్తామని చెబుతున్నారు. చివరి నిమిషం వరకూ టెంట్స్ రెడీ చెయ్యలేదు. – స్టాల్ దరఖాస్తుదారు


