సిల్క్ ఎక్స్ పో వస్త్ర సంబరాలు
డాబాగార్డెన్స్: వివాహాది వేడుకలకు కావల్సిన విశిష్ట, విభిన్న వస్త్రాల ప్రదర్శన నేషనల్ ఎక్స్ పో ఎగ్జిబిషన్ కమ్ సేల్ నగరానికి వచ్చింది. ఈ వస్త్ర ప్రదర్శన ఈ నెల 16వ తేదీ వరకు వాల్తేర్ మెయిన్‌రోడ్డులో ఉన్న హోటల్ గ్రీన్‌పార్క్‌లో ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక బంధాలు, వివిధ రాష్ట్రాల మగ్గాల ఉత్పత్తులను ఒకే ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చారు. ప్రదర్శనలో వేలాది రకాల పట్టు, కాటన్ డిజైన్ దుస్తులు, డిజైనర్ చీర, బ్లౌజ్‌లు, కుర్తాలు వంటివి 50 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మహారాష్ట్ర సొగసైన పైథానీ సిల్క్ చీరలు, కర్నాటక సిల్క్, సాఫ్ట్ సిల్క్, కాషిడా సిల్క్, మధ్యప్రదేశ్ ప్రసిద్ధి చందేరి, మహేశ్వరి సిల్క్, హ్యాండ్ పెయింట్, బలుచారి, జమ్దాని, తంగైల్, ధకై మస్లిన్ సిల్క్, పశ్చిమ బెంగాల్ లినెన్ చీర కాంత వర్క్, స్టిచ్ చీరలు ఉన్నాయన్నారు. అలాగే నేత చీరలు, దుప్పట్లు, సల్వార్ మెటీరియల్, బిహార్ భాగల్పూర్ సిల్క్, గుజరాత్ సాంప్రదాయ బంధిని, కచ్ ఎంబ్రాయిడరీ, పటోలా, తమిళనాడు కంజీవర, జమ్మూ కాశ్మీర్ తాబి సిల్క్, ప్రింట్ చీరలు కూడా ప్రదర్శనలో కలవని పేర్కొన్నారు.


