లక్ష్యానికి మించి కోటి సంతకాల సేకరణ
మహారాణిపేట : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు అన్నారు. శుక్రవారం మద్దిలపాలెంలో గల పార్టీ కార్యాలయంలో కె.కె.రాజు ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో లక్ష్యాన్ని మించి సంతకాల సేకరణ చేపట్టిన పార్టీ శ్రేణులను అభినందించారు. ప్రజల నుంచి సేకరించిన సంతకాలను ఈ నెల 9వ తేదీన అన్ని వార్డుల నుంచి వచ్చిన సంతకాలను నియోజకవర్గ కేంద్రాలకు పంపాలని సూచించారు. ఈ నెల 10వ తేదీన నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాల్లో పంపాలన్నారు. ఈ నెల 13వ తేదీన జిల్లా కార్యాలయం నుంచి జెండా ఊపి నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి రాష్ట్ర కేంద్ర కార్యాలయానికి పంపించాలన్నారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, నియోజకవర్గ పరిశీలకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, సీఈసీ సభ్యుడు కోలా గురువులు, మాజీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ, సీఈసీ సభ్యులు, రాష్ట్ర అనుబంధ విభాగం, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు, కార్పొరేటర్లు, జిల్లా పార్టీ కార్యవర్గ కమిటీ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.


